గురువారం 09 జూలై 2020
National - Jun 30, 2020 , 17:42:08

ఒడిశాలో రేప‌ట్నుంచి తెరుచుకోనున్న మ‌ద్యం దుకాణాలు

ఒడిశాలో రేప‌ట్నుంచి తెరుచుకోనున్న మ‌ద్యం దుకాణాలు

భువ‌నేశ్వ‌ర్‌: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒడిశాలో గ‌త మూడు నెల‌ల‌కుపైగా మూత‌ప‌డ్డ మ‌ద్యం దుకాణాలు బుధ‌వారం తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు ఒడిశా ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే వైన్స్ షాపుల‌లో కౌంట‌ర్ సేల్‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంద‌ని, ప‌ర్మిట్ రూమ్‌లకు అవ‌కాశం లేద‌ని వారు తెలిపారు. అదేవిధంగా ప‌లు దుకాణాల నుంచి హోం డెలివ‌రీకి కూడా అనుమ‌తి ఉంద‌ని చెప్పారు. 

అయ‌తే, మ‌ద్యం దుకాణాల ప‌నివేళ‌ల‌పై ఒడిశా ప్ర‌భుత్వం ప‌రిమితులు విధించింది. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే దుకాణాల‌ను తెరుచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. సాయంత్రం వేళ‌ల్లో మ‌ద్యం దుకాణాల ద‌గ్గ‌ర ర‌ద్దీని త‌గ్గించ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆన్‌లైన్‌లో మ‌ద్యం బుక్ చేసుకునే వారికి టైమ్ స్లాట్‌తో ఈ-టోకెన్లు జారీచేసే విధానాన్ని ఒడిశా రాష్ట్ర బేవ‌రేజ్‌ కార్పొరేష‌న్ అభివృద్ధి చేసింద‌ని తెలిపింది. 


logo