శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 15:25:03

ఏపీలో మద్యం షాపులను తగ్గిస్తూ ఉత్తర్వులు

ఏపీలో మద్యం షాపులను తగ్గిస్తూ ఉత్తర్వులు

తాడేపల్లి: మద్య నియంత్రణ, నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  ముందుకు సాగుతోంది.   రాష్ట్రంలో మొత్తంగా 33శాతం వైన్‌ షాపులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం దుకాణాల సంఖ్య 2934కు తగ్గనుంది.  గతంలోనే 40శాతం బార్లు, 20శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం తాజాగా మరో 13శాతం వైన్స్‌ షాపులను రద్దు చేసింది. ఈనెలఖరు వరకు దుకాణాలు తీసివేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల గతంలోనే  4380 మద్యం షాపులను 3500లకు తగ్గించిన విషయం తెలిసిందే. 


logo