గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 15:38:24

ఏకంగా మూడు కిలోమీటర్ల క్యూలైన్‌..గిన్నిస్‌కెక్కిన వైన్‌షాపు

ఏకంగా మూడు కిలోమీటర్ల క్యూలైన్‌..గిన్నిస్‌కెక్కిన వైన్‌షాపు

ఆహా.. ఈ క్యూలైన్ చూడండి. ఇదేదో పోటీల్లో పాల్గొనేందుకు క్యూలో నిల్చున్న‌ట్లు ఉంది క‌దా. అలా అనుకుంటే పొర‌పాటే. ఇది  మందుబాబుల క్యూలైన్‌.  లాక్‌డౌన్ వ్య‌వ‌ధిలో బార్ల‌న్నీ మూత‌బ‌డ్డాయి. చుక్క‌ప‌డందే నిద్ర‌ప‌ట్ట‌ని తాగుబోతులంద‌రికీ పిచ్చిప‌ట్టినంత ప‌నైంది. నాలుగు రోజుల నుంచి కొన్ని జోన్ల‌లో వైన్‌షాపులు ఓపెన్ చేసేందుకు ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డంతో మందుబాబుల ఆనందానికి హ‌ద్దు లేకుండా పోయింది. 

 త‌మిళ‌నాడులోని క‌డ‌లూరులో ఓ మ‌ద్యం దుకాణం ముందు క్యూలైన్ ఏకంగా గిన్నిస్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న‌ది. ఈ వైన్‌షాపు ముందు మందుబాబుల క్యూ 3 కి.మీ. పొడ‌వుతో రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో మ‌రే మ‌ద్యం దుకాణం ముందు ఇంత పొడ‌వైన క్యూ ఇప్ప‌టివ‌ర‌కు లేక‌పోవ‌డం విశేషం.logo