సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 19:46:46

యూపీలో ఆగస్టు 25 నుంచి షాపింగ్‌ మాల్స్‌లో మద్యం అమ్మకాలు షురూ

యూపీలో ఆగస్టు 25 నుంచి షాపింగ్‌ మాల్స్‌లో మద్యం అమ్మకాలు షురూ

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని షాపింగ్ మాల్స్‌లో జూలై 27 నుంచి అంతర్జాతీయ, ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని విక్రయించడానికి లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దిగుమతి చేసుకున్న మద్యం ఆగస్టు 25 నుంచి మాల్స్‌లో విక్రయించుకోవచ్చని పేర్కొంది. విదేశీ మద్యం, ఇండియన్ స్కాచ్, బ్రాందీ, జిన్, వైన్, వోడ్కా, రమ్ రూ.700 కంటే ఎక్కువ ధర గల మద్యంతో పాటు ఒక బీరు రూ.160 అంతకంటే అధిక ధరల్లో మాల్స్‌లో మద్యం లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. 

వార్షిక లైసెన్స్ ఫీజును రూ.12 లక్షలుగా నిర్ణయించారు. దీన్ని ఏవ్యక్తి అయినా పొందవచ్చు. ఈ మాల్స్‌ ఉదయం 10 నుంచి 9 గంటల వరకు పనిచేయడానికి అనుమతించబడతాయని వినియోగదారులు అవుట్‌లెట్లలోకి ప్రవేశించి అల్మారాల నుంచి బ్రాండ్లను ఎంచుకోవచ్చు అని ఎక్సైజ్ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ భూస్రెడ్డి అన్నారు.  "గత కొన్ని సంవత్సరాలుగా, మాల్స్ నుంచి షాపింగ్ చేసే ధోరణి వేగంగా పెరిగింది. దీన్ని చూసే షాపింగ్ మాల్స్ నుంచి ఖరీదైన విదేశీ మద్యం అమ్మకాలను అనుమతించాలని రాష్ట్రం నిర్ణయించింది" అని భూస్రెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo