గురువారం 28 జనవరి 2021
National - May 05, 2020 , 12:44:21

ఏపీలో మరో 50 శాతం పెరిగిన మద్యం ధర

ఏపీలో మరో 50 శాతం పెరిగిన మద్యం ధర

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం ప్రియులకు మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం ధరలు పెంచిన ఏపీ సర్కారు ఇప్పుడు ఏకంగా మరో 50 శాతం ధరలు పెంచింది. సోమవారం వైన్స్‌ షాపులకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిస్తూ దుకాణాలను తెరిపించింది. దీంతో షాపుల ముందు జనం బారులు తీరారు. ఈ నేపథ్యంలో మద్యంపై మరో 50 శాతం ధర పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పెంపుతో కలిపి ఇప్పుడు ఏపీలో మద్యం ధర 75 శాతం పెరిగినట్లయ్యింది. అంటే ఇదివరకు రూ.100కు లభించిన మద్యం ధర ఇప్పుడు రూ.175కు చేరిందన్న మాట. కాగా, ఈ పెంపు మంగళవారం మధ్యాహ్నం నుంచే అమల్లోకి వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఆల్కహాల్‌ వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెప్పారు.      logo