బుధవారం 27 మే 2020
National - May 16, 2020 , 19:10:37

గుంటూరులో భారీగా లిక్కర్‌ బాటిళ్లు సీజ్‌!

గుంటూరులో భారీగా లిక్కర్‌ బాటిళ్లు సీజ్‌!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరులో పోలీసులు భారీగా లిక్కర్‌ బాటిళ్లను సీజ్‌ చేశారు. ఆ లిక్కర్‌ బాటిళ్ల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి పుచ్చకాయల లోడుతో వెళ్తున్న మూడు మినీ ట్రక్కులను తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లోని పొందుగల చెక్‌పోస్ట్‌ దగ్గర ఏపీ పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పుచ్చకాయల కింద దాచి ఉంచిన రూ.5 లక్షల విలువైన 2,332 క్వార్టర్‌ బాటిళ్లు బయటపడ్డాయి. తెలంగాణలోని నల్లగొండ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదకూరపాడుకు ఈ బాటిళ్లను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం బాటిళ్లు, మూడు మినీ ట్రక్కులను సీజ్‌ చేయడంతోపాటు, ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.


logo