గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 18:41:44

కరోనా ఎఫెక్ట్‌.. బార్లు బంద్‌

కరోనా ఎఫెక్ట్‌.. బార్లు  బంద్‌

పుదుచ్చేరి: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)వ్యాప్తి చెందకుండా కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. సభలు, సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచనలు జారీచేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రేపటి నుంచి మద్యం బార్లు మూసివేయనున్నట్లు పుదుచ్చేరి సీఎం వీ నారాయణ స్వామి వెల్లడించారు. పర్యాటక ప్రదేశాలు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు ఇవాళ్టి నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. 


logo