శుక్రవారం 10 జూలై 2020
National - May 29, 2020 , 15:11:37

కరోనా దెబ్బకి భారీగా పడిపోయిన లిప్‌స్టిక్‌ సేల్స్‌

కరోనా దెబ్బకి భారీగా పడిపోయిన లిప్‌స్టిక్‌ సేల్స్‌

కరోనా వ్యాప్తితో ఎప్పుడూ వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ చేయని వారు కూడా ఇంట్లో కూర్చొనే వర్క్‌ చేస్తున్నారు. దీంతో ఆఫీసుకు వెళ్లే పనేలేదు. అంతేకాదు లాక్‌డౌన్‌ కారణంగా బయటకు వెళ్లాలంటే మాస్క్‌ తప్పనిసరిగా మారింది. ఇక అమ్మాయిలు మేకప్‌ విషయంలో లైట్‌ తీసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా లిప్‌స్టిక్ డిమాండ్‌ తగ్గదు. అలాంటిది లాక్‌డౌన్‌ కారణంగా దారుణంగా డిమాండ్‌ పడిపోయిందని మేకప్‌ ప్రాడక్ట్స్‌ యాజమాన్యం వాపోతున్నారు. మాస్క్‌ వేసుకున్నప్పుడు కళ్లు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి అమ్మాయిలు ఐ ప్రాడక్ట్స్‌ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 

వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ చేసేవారు అఫీషియల్‌ వీడియో ప్రజెంటేషన్‌లో కనిపించాల్సి వచ్చినప్పుడు మాత్రమే లిప్‌స్టిక్‌ వేసుకుంటున్నారు. అంతే తప్ప మరెక్కడా లిప్‌స్టిక్‌ వేసుకోవాల్సిన అవసరం రావట్లేదని ప్రముఖ కాస్మొటిక్స్‌ కంపెనీ లోరియల్‌ ఇండియా డైరెక్టర్‌ కవిత అంగ్రే చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్‌లో లిప్‌స్టిక్‌ సేల్స్‌ భారీగా పడిపోయాయి. ఐ ప్రాడక్ట్స్‌ సేల్స్‌ విపరీతంగా అమ్ముడుపోతున్నాయని వాపోయారు. 


logo