మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 11:42:57

డోర్‌ లాక్‌ చేస్కోండి.. లేకుంటే సింహం లిఫ్ట్‌ అడుగుతది!

డోర్‌ లాక్‌ చేస్కోండి.. లేకుంటే సింహం లిఫ్ట్‌ అడుగుతది!

సింహాలు జింకల్ని వేటాడమే కాదు.. సఫారీ కూడా చేయాలనుకుంటాయి. కాకపోతే వాటికి ఎలాంటి వాహనం లేకపోవడంతో ఆగున్నాయి. ఇప్పుడా కారు దొరికింది. కారు వేరేవాళ్లది కావడంతో లిఫ్ట్‌ అయినా అడుగుదామనుకున్నాయి. 

అడవుల్లోకి వచ్చిన టూరిస్టులు ఒకచోట కారుని ఆపి  ప్రకృతిని ఆశ్వాదిస్తున్నారు. పక్కనే సింహాల గుంపు కూడా ఉంది. ఆ మందని కారులో ఉన్నవాళ్లెవరూ చూడలేదు. ఎప్పటి నుంచో సఫారీ చేద్దామనుకుంటున్న సింహాలకు కార్‌ కనిపించడంతో ఏమాత్రం ఆగలేకపోయాయి. కార్‌ డోర్‌ తెరవడానికి ఒక సింహం తెగ ప్రయత్నం చేసింది. అందులో మనుషులు ఉండడంతో లిఫ్ట్‌ అయినా అడుగుదామనుకున్నాయి. 40 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోలో ఎట్టకేలకు పళ్లతో కార్‌ డోర్‌ ఒపెన్‌ చేసేసిందో సింహం. ఇక యజమానిని లిఫ్ట్‌ అడుగుదామనుకునే సరికి లోపలే ఉన్న అమ్మాయి భయపడి టక్కున డోర్‌ మూసేసింది. సింహాన్ని చూసిన వారు అక్కడి నుంచి పరార్‌ అయ్యారు. ఈ వీడియోను  ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశాడు. వీడియో చూసిన వారంతా తెలివగల్ల సింహం అని ఒకరు అంటుంటే దేవుడా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.


logo