మంగళవారం 31 మార్చి 2020
National - Mar 10, 2020 , 17:43:22

జనాలను భయపెట్టిన సింహం..వీడియో

జనాలను భయపెట్టిన సింహం..వీడియో

న్యూఢిల్లీ:  గుజరాత్‌లోని మాధవ్‌పూర్‌ గ్రామంలో ఓ మృగరాజు అందరికీ చమటలు పట్టించింది. గ్రామంలోని కొంతమంది ఒక్క చోట చేరి మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే హఠాత్తుగా అటువైపు నుంచి  సింహం ఉస్సేన్‌ బోల్ట్‌ పరుగును మరిచిపోయే వేగంతో దూసుకొచ్చింది. క్రూరమృగం ఒక్కసారిగా జనాల్లోకి రావడంతో అక్కడున్న వారంతా భయంతో కేకలు వేశారు. అయితే ఆ సింహం మాత్రం అందరిని భయపెట్టకుండా..తన దారి తాను చూసుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏడు సెకన్ల వ్యవధిలో సింహం హల్‌చల్‌ చేసిన వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 
logo
>>>>>>