బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 16:08:39

విపణిలోకి లింకోల్న్ ఫార్మా ఇమ్మ్యూనిటీ ట్యాబ్లెట్లు

విపణిలోకి లింకోల్న్ ఫార్మా ఇమ్మ్యూనిటీ ట్యాబ్లెట్లు

హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ హెల్త్‌కేర్ కంపెనీలలో ఒకటైన లింకోల్న్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ విటమిన్ సీ + జింక్ ట్యాబ్లెట్లను భారతదేశ మార్కెట్‌లో విడుదల చేసింది. జింక్ కలయికతో సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి ని పెంచడమే కాకుండా యాంటీ వైరల్ యాక్టివిటీని ఈ టాబ్లెట్ రక్షణ కల్పిస్తుంది. భారతదేశంలో విటమిన్ సీ ,జింక్ ట్యాబ్లెట్ల మార్కెట్ 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఇది ప్రతి ఏటా 15శాతం వృద్ధి నమోదుచేస్తుంది.

"కరోనా మహమ్మారి సమయంలో రోగ నిరోధక శక్తి బూస్టర్లు మాత్రమే వైరస్ నుంచి కాపాడగలవు. తమ రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరికీ విటమిన్ సీ , జింక్ ట్యాబ్లెట్లు చాలా ముఖ్య మైనవి. చూయింగ్ టాబ్లెట్ రూపంలో ఉండటంతో ఎవరైనా వీటిని వాడవచ్చు. కోవిడ్-19తో పోరాటానికి కంపెనీ కట్టుబడి ఉందని అందులోభాగంగానే వీటిని అందిస్తున్నామని '' లింకోల్న్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్ అశీష్ ఆర్ పటేల్ అన్నారు.


logo