శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 07:17:01

బీహార్‌లో పిడుగుపాటుకు 8 మంది మృతి

బీహార్‌లో పిడుగుపాటుకు 8 మంది మృతి

పట్నా: బీహార్‌లో పిడుగుపాటుకు ఎనిమిది మంది మృతిచెందారు. శుక్రవారం కురిసిన భారీవర్షాలకు తోడు పిడుగులు పడటంతో ఎనిమిది మంది మరణించారని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. మృతులు సమస్తిపూర్‌, లఖీసరాయ్‌, గయా, బాంకా జిల్లాలకు సంబంధించినవారని వెల్లడించింది. రాష్ట్రంలో గురువారం పిడుగులు పడటంతో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో గత వారం రోజుల్లో పిడుగుపాటుకు వంద మందికిపైగా మరణించారు.   

పిడుగుపాటుకు మృతిచెందినవారికి కుటుంబాలకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రభుత్వం వారిని అన్నివిధాల ఆదుకుంటుందని వెల్లడించారు.


logo