మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 15:03:30

35 ఏండ్ల క్రితం కేసులోదోషులకు జీవితఖైదు

35 ఏండ్ల క్రితం కేసులోదోషులకు జీవితఖైదు

జైపూర్‌ : 35 ఏండ్ల క్రితం జరిగిన రాజా మాన్‌సింగ్‌ హత్య కేసులో దోషులకు మధురలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేసింది. మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ సహా 11 మంది పోలీసులకు జీవితఖైదుల విధించింది. అదేవిధంగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. న్యాయమూర్తి సాధనా రాణి ఠాకూర్‌ శిక్షను ప్రకటించగానే దోషులను మధుర సెంట్రల్‌ జైలుకు తరలించారు.

1985 లో అప్పటి ముఖ్యమంత్రి వాడుతున్న హెలీకాప్టర్‌ను కోపంతో తన జీపుతో రాజా మాన్‌సింగ్‌ ఢీకొట్టాడు. ఈ ఘటనలో పోలీసులు రాజామాన్‌సింగ్‌పై కాల్పులు జరుపగా అక్కడికక్కడే మరణించారు. ఈ కేసులో కాన్ సింగ్ భాటి (మాజీ డీగ్ డీఎస్పీ), వీరేంద్ర సింగ్, సుఖ్‌రామ్, జాగ్‌రామ్, జగ్ మోహన్, షేర్ సింగ్, పద్మారామ్, హరి సింగ్, చితార్ సింగ్, భవర్ సింగ్, రవిశేఖర్ లు ముద్దాయిగా ఉన్నారు. సీబీఐ తన చార్జిషీట్లో 18 మంది పోలీసుల పేర్లను పేర్కొన్నది. వీరిలో నలుగురు విచారణ సమయంలోనే మరణించారు. మరో ముగ్గురు నిర్దోషులుగా బయటపడ్డారు.

రాజా మాన్ సింగ్.. భరత్పూర్ చివరి పాలకుడు మహారాజా సవాయి వృజేంద్ర సింగ్ సోదరుడు. మహారాజా కిషన్ సింగ్ కు కుమారుడు. 1921 డిసెంబర్ 5 న జన్మించిన అతను ఇంగ్లండ్‌లో ఇంజినీరింగ్ చదివాడు. 1952-1984 మధ్య డీగ్ నుంచి ఏడుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు.


logo