గురువారం 04 మార్చి 2021
National - Nov 29, 2020 , 06:30:52

పెన్షనర్లు.. ఫిబ్రవరి 28లోపు లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొచ్చు

పెన్షనర్లు.. ఫిబ్రవరి 28లోపు లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొచ్చు

న్యూఢిల్లీ: పెన్షన్‌ తీసుకుంటున్న విశ్రాంత ప్రభుత్వోద్యోగులు లైఫ్‌ సర్టిఫికెట్ సమర్పించే గడువును ఈపీఎఫ్‌ఓ పొడిగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోపు పెన్షనర్లు ఎప్పుడైన తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చని ప్రకటించింది. దీంతో 35 లక్షలకుపైగా పెన్షనర్లకు ఊరట లభించనుంది. పెన్షనర్లు ఏటా నవంబర్‌లోగా లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలు, సంయుక్త సేవా కేంద్రాలు, పెన్షన్‌ డిస్బర్సింగ్‌ బ్యాంకులు, పోస్టల్‌ నెట్‌వర్క్‌, జేపీపీ పోర్టల్‌ ద్వారా వీటిని సమర్పించవచ్చు. కరోనా వైరస్‌ నేప‌థ్యంలో ఈ నెలా‌ఖ‌రు‌కల్లా లైఫ్‌ సర్టి‌ఫి‌కె‌ట్‌ను చాలా‌మంది సమ‌ర్పిం‌చ‌లేని పరి‌స్థితి నెల‌కొ‌న్నది. దీంతో ఈ నెల 30 వర‌కున్న గడు‌వును మరో మూడు నెలలు పొడి‌గి‌స్తు‌న్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

VIDEOS

logo