మంగళవారం 14 జూలై 2020
National - Jun 15, 2020 , 15:00:56

సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్‌కు ఎదురు దెబ్బ!

సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్‌కు ఎదురు దెబ్బ!

విశాఖపట్నం : విశాఖ ఎల్ జీ పాలిమర్స్‌కు సుప్రీం కోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. విషవాయువు లీకేజీ దుర్ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకోవడాన్ని, హైకోర్టు ప్లాంట్‌ను సీల్ చేయడాన్ని సవాల్ చేస్తూ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. ఎల్జీ పాలిమర్స్‌ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింన సుప్రీంకోర్టు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. 


logo