ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 07:15:32

జమ్ముకు స్మార్ట్‌ సిటీ హంగులు

జమ్ముకు స్మార్ట్‌ సిటీ హంగులు

జమ్ము: జమ్మును స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా అక్కడ వైఫై హాట్‌స్పాట్లు, వర్టికల్‌ గార్డెన్స్‌, దారిని చూపే హైటెక్‌ సంకేతాలను ఏర్పాటు చేయనున్నారు. జమ్ముకశ్మీర్‌ స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ ముర్ము నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించారు. మొదటి దశలో డోగ్రా చౌక్‌ నుంచి కేసీ చౌక్‌ దాకా ఫ్లై ఓవర్‌ వెంట రూ. 4.5 కోట్లతో వర్టికల్‌ గార్డెన్‌ను పెంచనున్నారు. 10 జంక్షన్లలో సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చనున్నారు. మార్కెట్‌ స్థలాలు, రోడ్లు మొదలైనవాటిపై ఆక్రమణలను వెంటనే తొలగించాలని ముర్ము ఈ సందర్భంగా అధికారులను అదేశించారు. 


logo