శనివారం 04 జూలై 2020
National - Jun 18, 2020 , 20:43:51

ఎల్జీ ఉత్పత్తులపై బీమా

ఎల్జీ ఉత్పత్తులపై బీమా

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఎల్జీ పలు ఉత్పత్తులపై వినియోగదారులకు బీమా సదుపాయం కల్పిస్తున్నది. చోల మండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సహకారంతో బీమాను అందిస్తున్నది. ఎంపిక చేసిన గృహోపకరణ కొనుగోలుపై వినియోగదారులు రూ.50వేల వరకు పొందవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ అన్ని స్టోర్లలో లభ్యం అవుతుందని, ఈ నెలాఖరు వరకు ఆఫర్‌ వర్తిస్తుందని ప్రకటించింది. ‘కొవిడ్‌’ బీమా రూ.50వేలు, రూ.30వేలు, రూ.10వేలు స్లాబుల్లో వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లతో పాటు ఇతర అప్లయన్స్‌పై బీమా వర్తింపజేయనున్నట్లు తెలిపింది.  


logo