శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 21, 2020 , 23:20:30

పార్కిన్ సన్స్ వ్యాధిని అంతం చేసేందుకు కలసికట్టుగా కదులుదాం

పార్కిన్ సన్స్ వ్యాధిని అంతం చేసేందుకు కలసికట్టుగా కదులుదాం

రేపు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా...

హైదరాబాద్: ప్రతి ఏటా జూలై 22 ను వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరోలజీ (డబ్ల్యూఎఫ్ఎన్) వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆరేండ్ల నుంచి  ఈ డే ను జరుపుతున్నారు. దీని ప్రధాన ఉద్దేశం మెదడు ఆ రోగ్యం పై అవగాహన పెంచడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై అవసరాలను తీర్చడం. పార్కిన్ సన్స్ వ్యాధి (పీడీ) అనేది నెమ్మదిగా సాగే ఒక డిజనరేటివ్ వ్యాధి. అది దాదాపుగా మెదడు అన్ని విధులను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఆ వ్యక్తిని ఏం చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ వ్యాధితో బాధపడేవారికి సహాయం చేసే ఉద్దేశంతో అంతా కలసికట్టుగా పోరాడాలనే లక్ష్యంతో ఈ ఏడాది అందరి దృష్టి పార్కిన్ సన్స్ వ్యాధిపై పడేలా చేసింది డబ్ల్యూ ఎఫ్ఎన్. 

కోవిడ్ -19 నేపథ్యంలో ప్రపంచ మానవాళి ఆరోగ్యం గురించి మనకు గుర్తు చేసింది. ప్ర పంచ వ్యాప్తంగా 70 లక్షల మంది పార్కిన్ సన్స్ వ్యాధితో భాధపడుతున్నట్లుగా అంచనా. 2050 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నది. అందుకే ఈ వ్యాధిని సత్వరమే గుర్తించ డంతోపాటు , దానిపై అవగాహన పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా ఈ వ్యాధికి అసలైన కారణమేంటో, దానికి చికిత్స ఏమిటో కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉన్నది. పార్కిన్ సన్స్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హైదాబాద్ లోని ఎస్ ఎల్జీ హాస్పిటల్ న్యూ రో సైన్సెస్ విభాగం చొరవ తీసుకున్నది.

డాక్టర్ అభినయ్ ఎం హుచ్ చె (ఎస్ఎల్జీ హాస్పిటల్ లో న్యూరోలాజిస్ట్) ఫేస్ బుక్ లైవ్ లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్లో ఈ వ్యాధి గురించి అవగాహన పెంచనున్నారు. పీడీ రోగులు ,వారి సంరక్షకులు తమ సందేహాలను తీర్చుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించు కోవచ్చు. బ్రెయిన్ హెల్త్ అనేది అందరికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎస్ఎల్జీ హాస్పిటల్ 2020 జూన్ 22 నుంచి ఒక నెల రోజుల పాటు ఎంఆర్ ఐ బ్రెయిన్ పై 50శాతం  రాయితీ ఇవ్వనున్న ది. తలనొప్పి, వెర్టిగో, స్ట్రోక్, మూర్ఛ, డెమెన్షియా, పార్కిన్ సన్స్ వ్యాధి తో సహా మెదడు సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఈ ఆఫర్ వినియోగించు కోవచ్చు.

 


logo