గురువారం 09 జూలై 2020
National - Jun 22, 2020 , 01:49:12

యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు!

యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు!

  • ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 21: యోగా సాధన వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగా ఐకమత్యానికి చిహ్నమని, సౌభ్రాతృత్వాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో ఈ ఏడాది యోగా దినోత్సవం ప్రజలందరూ ఇండ్లల్లోనే జరుపుకొన్నారు. 

మానసిక ప్రశాంతతకు యోగా: రాష్ట్రపతి

యోగా వల్ల శారీరక దృఢత్వంతోపాటు మనసుకు ప్రశాంతత లభిస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఆదివారం తాను చేసిన యోగాసనాల చిత్రాల్ని కోవింద్‌ ట్విట్టర్‌లో పంచుకున్నారు.


logo