బుధవారం 08 జూలై 2020
National - Jun 20, 2020 , 10:19:59

చైనాను ఆర్థికంగా దెబ్బ కొడుదాం: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

చైనాను ఆర్థికంగా దెబ్బ కొడుదాం: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

భోపాల్‌: ల‌ఢఖ్‌లోని గ‌ల్వాన్ న‌దీ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌ల‌పై దేశ‌వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త జ‌వాన్లు ప్రాణాలు కోల్పోవ‌డాన్ని భార‌త స‌మాజం త‌ట్టుకోలేక‌ పోతున్న‌ది. చైనాకు త‌గ్గిన బుద్ది చెప్పాల‌ని ఆగ్ర‌హంతో ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చైనా తీరుపై మండిప‌డ్డారు. చైనాకు త‌గిన శాస్తి చేసి తీరాల‌న్నారు. 

స‌రిహ‌ద్దుల్లో చైనా సైన్యం చేసిన దారుణానికి భార‌త సేన‌లు స‌రైన స‌మాధానం చెబుతాయని శివరాజ్‌సింగ్ పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌లుగా మ‌నం కూడా చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టాల‌ని ఆయ‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. చైనా నుంచి దిగుమ‌తి చేసుకున్న ఉత్ప‌త్తులన్నింటిన బ‌హిష్క‌రిద్దామ‌ని ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు.      


logo