సోమవారం 30 మార్చి 2020
National - Feb 27, 2020 , 14:35:52

నియ‌మం ప్ర‌కార‌మే జ‌డ్జి బ‌దిలీ: ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌

నియ‌మం ప్ర‌కార‌మే జ‌డ్జి బ‌దిలీ:  ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌

హైద‌రాబాద్‌:  పోలీసుల వైఫ‌ల్యం వ‌ల్లే ఢిల్లీ అల్ల‌ర్లు చోటుచేసుకున్న‌ట్లు చెప్పిన ఢిల్లీహైకోర్టు న్యాయ‌వాది ముర‌ళీధ‌ర్‌ను పంజాబ్ కోర్టుకు బ‌దిలీ చేసిన విష‌యం తెలిసిందే.  అయితే నియ‌మావ‌ళి ప్ర‌కార‌మే ఆయ‌న్ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు.  కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను గౌర‌వించాల‌న్నారు.  ఈ అంశాన్ని రాజ‌కీయం చేయ‌వ‌ద్దు అన్నారు. సీజేఐ నేతృత్వంలో సుప్రీం కొలీజియం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కార‌మే జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్‌ను బ‌దిలీ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. బ‌దిలీ ప్ర‌క్రియ‌లో జ‌డ్జి స‌మ్మ‌తం కూడా తీసుకున్న‌ట్లు చెప్పారు. ఇదే ప‌ద్ధ‌తి ప్ర‌కారం మ‌రో ఇద్ద‌రు జ‌డ్జీల‌ను కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేశామ‌న్నారు. జ‌డ్జి ముర‌ళీధ‌ర్ బ‌దిలీను ప్ర‌తిప‌క్షాలు ఖండించాయి. రాత్రికి రాత్రి జ‌డ్జిను ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం షాకింగ్‌గా ఉంద‌ని ప్రియాంకా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్‌లో జ‌డ్జీ లోయాను గుర్తు చేస్తున్నారు. 


logo