ఆదివారం 07 జూన్ 2020
National - Apr 06, 2020 , 11:04:53

క‌రోనా ర‌హిత భార‌త్‌ను సాధిద్దాం: ప‌్ర‌ధాని మోదీ

క‌రోనా ర‌హిత భార‌త్‌ను సాధిద్దాం: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విజృంభిస్తున్న నేప‌థ్యంలో సామాజిక దూరం ప్రాముఖ్య‌త‌ను మ‌రోసారి చాటిచెప్పాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ బీజేపీ కార్య‌క‌ర్త‌లకు పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆప‌ద‌లో ఉన్న‌వారిని పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆదుకోవాల‌ని ప్ర‌ధాని కోరారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ 40వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన ప్ర‌ధాని.. ముందుగా కార్య‌క‌ర్త‌లందరికీ పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. 

క‌రోనాపై పోరాటంలో ప్ర‌తి కార్య‌క‌ర్త త‌నవంతు కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తిచేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లంతా సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్య‌క‌ర్త‌లంద‌రి కృషితోనే పార్టీకి ఇప్పుడు ప్ర‌జాసేవ అవకాశం లభించిందని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. క‌రోనాపై పోరాటంలో అంద‌రం స‌మిష్టిగా కృషి చేసి క‌రోనా ర‌హిత భార‌త్‌ను సాధిద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితులు కొన‌సాగిన‌న్ని రోజులు కార్య‌క‌ర్త‌లు పార్టీ మార్గ‌ద‌ర్శ‌కాలను తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌ని ఆయ‌న కోరారు.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo