కూరగాయల తోటల్లో వేసవిలో కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది. దానిని నివారించడానికి చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
టమాటలో: ఎకరం టమాట తోటలో కలుపును నివారించేందుకు 200 లీటర్ల నీటిలో 200 గ్రా. మెట్రిబుజిన్ 70 శాతం పొడి (టాటామెట్రి) కలుపుకొని, పిచికారీ చేయాలి.
బెండలో: 200 లీటర్ల నీటిలో 250 మి.లీ. ఫెనాక్సోప్రాప్ ఇథైల్ 9 శాతం ద్రావకం (విప్ సూపర్) కలిపి ఎకరం తోటలో పిచికారీ చేయాలి.
దొండలో: 200 లీటర్ల నీటిలో 400 మి.లీ. క్వైజిలాపాప్ ఇథైల్ 5 శాతం ద్రావకం (టర్గా సూపర్) కలిపి పిచికారీ చేయాలి.