సోమవారం 30 మార్చి 2020
National - Mar 17, 2020 , 01:13:48

స్వీయ క్రమశిక్షణే రక్ష

స్వీయ క్రమశిక్షణే రక్ష

న్యూఢిల్లీ:  ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తున్నది. కేవలం ఆరు కోట్ల మంది జనాభా గల ఇటలీలో ఒక్కరోజులో 368 మంది మృతితో విపత్తుగా మారింది. అదే పరిస్థితి భారత్‌లో తలెత్తితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ప్రస్తుతానికి మనదేశంలో పరిస్థితులు అలా మారకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు తోడు పౌరులుగా మనకు దానికి అడ్డుకట్ట వేసేందుకు మనపై గురుతర బాధ్యతలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం. 

  • ప్రభుత్వ ఆదేశాలు, హెచ్చరికలను పాటిద్దాం.. ప్రత్యేకించి స్వీయ క్రమశిక్షణ పాటిద్దాం. సభలకు,కర చాలనానికి దూరంగా ఉంటూ స్వీయ అప్రమత్తత పాటిద్దాం. 
  • అన్నింటికన్నా ముందు ఆందోళనకు గురి కాకుండా ఉందాం. ముందు జాగ్రత్త చర్యలతో తీవ్రతను తగ్గిద్దాం.
  • పౌరులుగా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారిద్దాం.
  • ఏ పని లేకపోతే ఇంటికి పరిమితమై ఉందాం.
  • పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇద్దాం. కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకుందాం. ముఖాన్ని తాకడం నిలిపేద్దాం. 
  • దేశంలోని ఇతర ప్రజల భద్రత కోసమే కరోనా పాజిటివ్‌ రోగులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తున్న నేపథ్యంలో  వైద్య పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలిన వారి విదేశీ ప్రయాణ వివరాలను దాచిపెట్టకుండా చూద్దాం.  
  • సోషల్‌ మీడియాలో తరుచుగా వస్తున్న వదంతులకు దూరంగా ఉంటూ.. వాస్తవాల ప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందాం. 


logo