సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 17:49:16

ఏపీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

ఏపీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు తెలిపారు. ఇటీవల ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ,పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అయోద్య రాంరెడ్డి బుధవారం రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీరితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏపీ రాజ్యసభ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ జీవితంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయడం గర్వంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని కీలక సమస్యలన్నింటినీ కేంద్రం వద్ద పరిష్కరించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాని వెల్లడించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo