బుధవారం 27 జనవరి 2021
National - Dec 25, 2020 , 13:02:19

రైతు చ‌ట్టాల‌ను ఓ ఏడాది పాటు అమ‌లు చేద్దాం: రాజ్‌నాథ్‌

రైతు చ‌ట్టాల‌ను ఓ ఏడాది పాటు అమ‌లు చేద్దాం:  రాజ్‌నాథ్‌

హైద‌రాబాద్‌: ఢిల్లీలో జ‌రిగిన ఓ స‌భ‌లో పాల్గొన్న ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌..  రైతు ఆందోళ‌న‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  ధ‌ర్నాల్లో పాల్గొంటున్న‌వారంతే రైతులే అని,  వారంతా రైతు కుటుంబాల‌కే జ‌న్మించిన‌వార‌ని, వారి ప‌ట్ల మాకు అమిత‌మైన గౌర‌వం ఉంద‌ని రాజ్‌నాథ్ అన్నారు.  రైతుల‌కు వ్య‌తిరేకంగా త‌మ ప్ర‌భుత్వం ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకోదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  కొత్త‌గా తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలను క‌నీసం ఒక ఏడాది పాటు అమ‌లు చేయ‌నివ్వండ‌ని, ఒక‌వేళ ఆ చ‌ట్టాలు రైతుల‌కు మేలు చేయ‌కుంటే, అప్పుడు అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు చేస్తామ‌ని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.  చ‌ర్చ‌ల‌తో అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చు అని,  రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని ప్ర‌ధాని మోదీ ఆకాంక్షిస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ వెల్ల‌డించారు.  ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న రైతులంతా  వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై జ‌రిగే చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఆయ‌న కోరారు.  


logo