శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 14:23:08

చ‌దువు నుంచి క‌రోనా మిమ్మల్ని దూరం చేయ‌లేదు !

చ‌దువు నుంచి క‌రోనా మిమ్మల్ని దూరం చేయ‌లేదు !

కోరనా వైర‌స్ వ్యాప్తితో ప్ర‌పంచం అంతా లాక్‌డౌన్ అయ్యింది. కాలేజీలు, పాఠ‌శాల‌లు అన్ని మూత‌ప‌డ్డాయి. కానీ నిజంగా చ‌దువుకోవాల‌ని ఉన్న విద్యార్థుల‌ను క‌రోనా ఏం చేయ‌లేద‌ని విద్యావేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికి కార‌ణం ఆధునిక సాంకేతిక‌త అందుబాటులో ఉండ‌ట‌మే. ఆన్‌లైన్లో ప‌లు యాప్‌లు, వెబ్‌సైట్‌లు అనేక ర‌కాల కోర్సుల‌ను అందుబాటులో ఉంచాయి. దేశంలో అన్ని ర‌కాల విద్యా కేంద్రాలు మూత‌ప‌డ్డ నేప‌థ్యంలో యూజీసీ, కేంద్ర‌మాన‌వ వ‌న‌రుల శాఖ ప‌లు సైట్ల వివ‌రాల‌ను ప్ర‌కటించాయి. దేశంలోని పాఠ‌శాల నుంచి పీహెచ్‌డీ స్థాయి వ‌ర‌కు ఉన్న విద్యార్థులు వాటిని ఉప‌యోగించుకోవాల‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో యూజీసీ వెల్ల‌డించంది. ఆన్‌లైన్‌ అభ్యాసంతో ఈ విలువైన స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌మిష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

స్వయం ఆన్‌లైన్ కోర్సులు: 

https://storage.googleapis.com/uniquecourses/online.html ఇంతకు ముందు SWAYAM ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన‌ ఉత్తమ బోధనా అభ్యాస వనరులకు ఈ సైట్‌ అందిస్తుంది, ఇప్పుడు ఏ విద్యార్థి అయినా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఉచితంగా ఈ సైట్‌ను చూడవచ్చు. ఆన్‌లైన్ లెర్నింగ్- స్వయం కోర్సులు విద్యార్థులకు ఉచితంగా లభిస్తాయి

UG / PG MOOC: 

http://ugcmoocs.inflibnet.ac.in/ugcmoocs/moocs_courses.php SWAYAM UG, PG (నాన్-టెక్నాలజీ) ఆర్కైవ్ చేసిన కోర్సుల అభ్యాస సామగ్రిని ఈ సైట్‌లో లభిస్తాయి.

ఇ-పిజి పాఠ‌శాల: 

epgp.inflibnet.ac.in సాంఘిక శాస్త్రాలు, కళలు, లలిత కళలు, మానవీయ శాస్త్రాలు, సహజ, గణిత శాస్త్రాల 70 పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాలలో 23,000 మాడ్యూల్స్ (ఇ-టెక్స్ట్ , వీడియో) దీనిలో ఉన్నాయి.  అదేవిధంగా దీనిలో అధిక నాణ్యత, పాఠ్యాంశాల ఆధారిత, ఇంటరాక్టివ్ ఇ-కంటెంట్‌ ఉంది.

యుజి సబ్జెక్టులలో ఈ-కంటెంట్ కోర్సువేర్:

సుమారు 24,110 ఈ-కంటెంట్ మాడ్యూళ్ళతో 87 అండ‌ర్ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు సంబంధించిన‌ ఈ-కంటెంట్ సీఈసీ వెబ్‌సైట్‌ http://cec.nic.in లో ఉంది.

స్వయంప్రభ‌:

https://www.swayamprabha.gov.in అనేది 32 డిటిహెచ్ ఛాన‌ళ్ల సమూహం, ఇది ఆర్ట్స్, సైన్స్, కామర్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు, ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి విభిన్న విభాగాలను కవర్ చేసే అధిక నాణ్యత గల విద్యా పాఠ్యాంశాల ఆధారిత కోర్సు విషయాలను అందిస్తుంది. జీవితాంతం నేర్చుకోవటానికి ఆసక్తి ఉన్న, దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, పౌరులందరికీ లా, మెడిసిన్‌, టెక్నాల‌జీ, వ్యవసాయం త‌దిత‌ర కోర్సులను ఇది అందిస్తుంది.

నేష‌న‌ల్ డిజిట‌ల్ లైబ్ర‌రీ 

ఈ సైట్ https:://ndl.iitkgp.ac.inలో దేశంలోని ప్ర‌ధాన‌మైన అన్ని భాష‌ల‌లో కంటెంట్ ఉంది. అన్ని ర‌కాల అక‌డ‌మిక్ విద్యార్థుల‌కు సంబంధించిన విష‌యాలు ఈ సైట్ అందిస్తుంది. దివ్యాంగుల‌కు సైతం ఈ సైట్ ప‌లు కోర్సుల‌ను అందిస్తుంది.

శోధ్‌గంగా:  

ఈ సైట్ https://shodhganaa.inflibnet.ac.in లో 2,60,000 ఇంటియ‌న్ ఎల‌క్ట్రానిక్ థీసిస్ త‌దిత‌ర అంశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పీహెచ్‌డీ చేసే వారికి ఇది చాలా ఉప‌యుక్తంగా ఉంటుంది.

ఈ-శోధ్ సింధూ: 

ఈ వెబ్‌సైట్ https://ess.inflibnet.ac.inలో ప్ర‌స్తుత‌, పాత‌వి 15 వేల జ‌ర్న‌ల్స్ తోపాటు బ‌యోగ్ర‌ఫీలు, వివిధ అంశాల‌కు సంబంధించిన‌ ఫాక్చువ‌ల్ డాటా బేస్ అందుబాటులో ఉన్నాయి.logo