శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 22, 2020 , 15:53:11

‘నువ్వు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోవచ్చు.. పోలీసులకు లొంగిపో’

‘నువ్వు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోవచ్చు.. పోలీసులకు లొంగిపో’

లక్నో: పోలీసులకు లొంగిపోవాలని వికాస్‌ దూబే సోదరుడు దీప్‌ ప్రకాశ్‌ దూబేకు తల్లి సరళ దూబే సూచించింది. కాన్పూర్‌లోని విక్రూ గ్రామంలో ఎనిమిది పోలీసులు మృతి చెందిన ఘటనలో దీప్‌ దూబే నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అతని తలపై రూ.20 రివార్డు ప్రకటించారు. మోసం, దోపిడీపై వినీత్‌ పాండే ఫిర్యాదుపై కృష్ణానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. బుధవారం సరళాదేవి చిన్నకొడుకు దీప్‌ దూబేను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నువ్వు వచ్చి పోలీసులకు లొంగిపో. లేకుంటే నీటితో పాటు కుటుంబం కూడా ఎన్‌కౌంటర్‌లో చంపబడవచ్చు. ముందుకు వచ్చి ఏం చేయలేదని పోలీసులకు చెప్పాలి. అప్పుడు రక్షణ లభిస్తుందని, వికాస్‌ దూబే సోదరుడివి కాబట్టి దాక్కోవద్దంటూ’ సూచించింది.

సమాచారం మేరకు.. లక్నోలోని కృష్ణానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో వికాస్‌, దీప్‌ దూబేలపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. అన్నదమ్ములిద్దరూ వేలం కొనుగోలు చేసిన కారును లాక్కునేందుకు ప్రయత్నించారని, డబ్బు డిమాండ్‌ చేశారని ఆరోపణలున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. దీప్‌ దూబే తన సోదరుడు చేసిన అనేక నేరాల్లో భాగం ఉంది. జూలై ౩న ఎనిమిది మంది పోలీసులను హత్య చేసినప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. లక్కోలో ఎక్కడో దాక్కున్నాడని, నిరంతరం స్థావరాన్ని మారుస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, నిఘా ఉంచేందుకు లక్నోలోని అతని ఇంటి వద్ద పోలీసులను మోహరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo