శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 19:31:33

గొర్రెల మందపై చిరుతల గుంపు దాడి..

గొర్రెల మందపై చిరుతల గుంపు దాడి..

బనిహాల్‌ : జమ్ముకశ్మీర్‌ రాంబాన్‌ జిల్లాలో చిరుతల దాడి కలకలం రేపింది. గోల్ సుబా డివిజన్‌లోని గుండి గాగ్రా గ్రామంలోని కొండప్రాంతంలో గుల్జార్‌ అహ్మాద్‌ చందైల్‌, ఫరూక్‌ అహ్మాద్‌ చందైల్‌ గొర్రెల షెడ్డు వేశారు. గురువారం రాత్రి షెడ్డులోకి ప్రవేశించిన చిరుతల గుంపు 40 గొర్రెలు, మేకలను హతమార్చాయి. విషయం తెలుసుకున్న రాంబాన్‌ అటవీశాఖ అధికారి  అహ్మాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితిని పరిశీలించేందుకు రాంబాన్‌ నుంచి కాళిమస్తా పంచాయతీకి వన్యప్రాణులశాఖ అధికారుల బృందాన్ని పంపినట్లు తెలిపారు. వన్యప్రాణి డివిజన్‌ పరిధిలోని కిత్వార్‌ ప్రాంతంలో వన్యప్రాణులు జీవాలను హతమారిస్తే ఎలాంటి పరిహారం ఇచ్చే అవకాశంలేదని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.