సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 14:51:08

మూడేండ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత

మూడేండ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత

బెంగళూరు: ఇంట్లోతల్లి పక్కన పడుకొన్న మూడేండ్ల చిన్నారిని చిరుతపులి ఎత్తుకెళ్లింది. ఈ ఘటన బెంగళూరులోని మగది తాలూకా రామనగరలో శుక్రవారం రాత్రి జరిగింది. వేసవి కావడంతో చల్లటి గాలి కోసం మూడేండ్ల చిన్నారి హేమంత్‌ తల్లిదండ్రులు తలుపులు తెరిచి పడుకొన్నారు. మొల్లగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తల్లి పక్కన పడుకొన్న చిన్నారిని నోట కరుచుకొని పరుగుతీసింది. ఉదయం లేచి చూసే సరికి పిల్లాడు కనిపించకపోవడంతో పరిసరాల్లో వెతకగా.. ఇంటికి 60 మీటర్ల దూరంలోని చెట్ల పొదల్లో సగం తిని పడేసిన బాలుడి మృతదేహం  కనిపించింది. ఇటీవలనే పిల్లాడితో కలిసి తల్లిగారింటికి రాగా ఈ దుర్ఘటన జరుగడం గ్రామస్థులను తీవ్రంగా  కలిచివేసింది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.


logo