మంగళవారం 19 జనవరి 2021
National - Dec 26, 2020 , 16:39:30

యువ‌తిని కొరికి చంపిన చిరుత‌

యువ‌తిని కొరికి చంపిన చిరుత‌

జునాఘ‌డ్‌: గుజ‌రాత్‌లోని జునాఘ‌డ్ జిల్లాలో మ‌రో దారుణం జ‌రిగింది. గ‌త సోమవారం జిల్లాలోని ధ‌న్‌ఫులియా గ్రామంలో రెండు సింహాలు ఓ 14 ఏండ్ల బాలిక‌పై దాడిచేసి హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే.. తాజాగా అలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. షెట్రుంజి వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రం ప‌రిధిలోని కాస‌న్ గ్రామంలో ఓ యువ‌తిపై చిరుత దాడిచేసింది. కొన ఊపిరితో ఉన్న బాధితురాలి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచెందింది. 

ఆర్తిబెన్ మ‌క్వానా (17) అనే యువ‌తి కుటుంబం కొన్నేండ్ల క్రితం బ‌తుకుదెరువు కోసం జునాఘ‌డ్‌కు వ‌ల‌స‌వెళ్లింది. ఎప్ప‌టిలాగే ఆమె కుటుంబ‌స‌భ్యులు శ‌నివారం కూడా పనుల‌కు వెళ్ల‌గా.. ఆర్తిబెన్ దుస్తులు ఉతుక్కునేందుకు స‌మీపంలోని బోరుబావి వ‌ద్ద‌కు వెళ్లింది. దుస్తులు ఉతుకుతుండగానే చిరుత ఆమె దాడి చేసింది. యువ‌తి మెడ‌ను నోట‌క‌రుచుకుని లాక్కుపోతుండ‌గా పొలంలో ప‌నిచేస్తున్న కూలీలు దాని వెంట‌ప‌డ్డారు. 

దాంతో చిరుత యువ‌తిని వ‌దిలేసి పారిపోయింది. వెంట‌నే బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచెందింది. మెడ‌లోకి చిరుత పండ్లు దిగ‌డంతో తీవ్ర ర‌క్తస్రావం అయ్యి యువ‌తి మ‌క్వానా మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు.          

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.