గురువారం 09 జూలై 2020
National - May 05, 2020 , 14:37:35

పులి, ఎద్దు స్నేహం..ఫొటో వైర‌ల్

పులి, ఎద్దు స్నేహం..ఫొటో వైర‌ల్

సాధార‌ణంగా పులి గోవుల‌ను వేటాడి చంపి తింటుంద‌నే విష‌యం తెలిసిందే. ఆవులు, గేదెలు, లేగ‌దూడ‌లు, జింక‌లు ఇలా ఏది క‌నిపించినా వేటాడి చంపేస్తుంది. కానీ ఓ పులి మాత్రం ఎద్దు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి..దాన్ని ఏమీ అన‌కుండా..  ఎద్దు త‌న స్నేహితుడు అన్న‌ట్లుగా క‌లిసిపోయింది. పులి చాలా సార్లు రాత్రి స‌మ‌యాల్లో ఆ ఎద్దు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి పోతుంద‌ట‌.

పులి, ఎద్దు స్నేహితుల్లా ప‌క్క‌ప‌క్క‌నే ప‌డుకున్న ఫొటో ఒక‌టి ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నందా ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. వ‌డోద‌ర‌లోని అంటోలి గ్రామంలో రోహిత్ వ్యాస్ అనే వ్య‌క్తి ఈ ఫొటో తీశాడు. చాలా రోజుల క్రితం తీసిన ఈ ఫొటో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo