సోమవారం 01 జూన్ 2020
National - May 15, 2020 , 17:05:12

తెరుచుకోనున్న 490 కిలోమీట‌ర్ల లేహ్‌-మ‌నాలీ హైవే

తెరుచుకోనున్న 490 కిలోమీట‌ర్ల లేహ్‌-మ‌నాలీ హైవే

లేహ్‌: మంచు తొల‌గింపు ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత సుమారు 490 కిలోమీట‌ర్ల పొడ‌వైన లేహ్‌-మ‌నాలీ జాతీయ ర‌హ‌దారిపై మ‌ళ్లీ వాహ‌న రాక‌పోక‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. లేహ్‌-మ‌నాలీ హైవేను మే 18న తిరిగి ప్రారంభించ‌నున్న‌ట్లు బార్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ అధికారులు తెలిపారు.

లేహ్ నుంచి ల‌ఢ‌ఖ్-హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కలుపుతూ వెళ్లే ఈ మార్గం వెంబ‌డి..బ‌రాల‌చ పాస్ వ‌ద్ద 16,050 అడుగుల ఎత్తు, టాంగ్ లాంగ్ లా పాస్ వెంబ‌డి 17,480 అడుగుల ఎత్తులో మంచు తొల‌గింపు ప‌నులు చాలెంజింగ్ తీసుకుని చేయ‌డం జ‌రిగింద‌ని, కొన్ని ప్రాంతాల్లో 35 అడుగులు, మ‌రికొన్ని ప్రాంతాల్లో 15 అడుగుల వ‌ర‌కు మంచు కూరుకుపోయింద‌ని బీఆర్‌వో ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo