శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 15:53:26

ఎల్‌ఈడీ మాస్కు.. వీడియో వైరల్‌

ఎల్‌ఈడీ మాస్కు.. వీడియో వైరల్‌

కోల్‌కతా : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో రకరకాల మాస్కులు తయారు చేసి ధరిస్తూ పలువురు వార్తల్లో నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కాంచపారాకు చెందిన గౌర్ నాథ్ అనే వ్యక్తి ఎల్‌ఈడీ మాస్కును ధరించగా ఈ విడియోను బంగ్లాదేశ్‌కు చెందిన బివాస్ దాస్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు చేసి దీన్ని ‘‘నైట్‌ మాస్క్‌’’గా అభివర్ణించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయ్యింది. 

తన ఆలోచనకు సృజనాత్మకతను జోడించి ఈ మాస్కును తయారు చేసినట్లు గౌర్‌నాథ్‌ తెలిపాడు. రంగులు మారే చిన్న ఎల్ఈడీ లైట్లను మాస్కులో ఉంచి తయారు చేసినట్లు ఆయన తెలిపాడు. దీన్ని అన్నివేళలా ధరించవచ్చు అని అతను చెప్పుకొచ్చాడు. 

“ప్రజలు ఈ మాస్కును చూసినప్పుడు, ఇది ఖచ్చితంగా అవసరమని వారు అనుకుంటారు. ఇది చూసిన తరువాత మాస్కులు ధరించని వారు కూడా ధరిస్తార’’ని గౌర్‌ నాథ్‌ తెలిపాడు. ప్రస్తుతం తరుణంలో మాస్కులు ధరించడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒక వినూత్న ప్రయత్నంగా చెప్పుకొవచ్చని స్థానికులు అంటున్నారు. logo