శనివారం 05 డిసెంబర్ 2020
National - Apr 12, 2020 , 01:25:55

ఇతరుల కోసం ఏదో ఒకటి వదులుకోండి..

ఇతరుల కోసం ఏదో ఒకటి వదులుకోండి..

జైపూర్‌: ‘చాక్లెట్‌ లేదా ఐస్‌క్రీమ్‌ తినలేకుండా ఉండలేకపోతున్నారా? ఈ కష్టకాలంలో మీ అలవాట్లను కాస్త తగ్గించుకోండి. ఉన్నవాటితోనే సరిపెట్టుకోండి. ఇతరుల కోసం ఏదో ఒకటి వదులుకోండి’ అని రాజస్థాన్‌లోని చురు జిల్లా కలెక్టర్‌ సందేశ్‌నాయక్‌ పిలుపునిచ్చారు. తన వంతుగా మధ్యాహ్న భోజనాన్ని మానేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని, ఉన్నవాటితోనే సర్దుకోవాలన్నారు. కొంత త్యాగం చేయాలని, ఇతరులను ఇలా ప్రోత్సహించాలని సూచించారు. స్పందించిన కొందరు అధికారులతోపాటు జిల్లావాసులు అల్పాహారం, ఓ పూట భోజనం, ఇష్టమైన కూర, తినుబండారాలు వంటివి మానేస్తున్నట్లు చెప్పారు. అంటార్కిటికా యాత్ర చేసిన రాజీవ్‌ బిర్డా తనకు వచ్చిన బహుమతులను వేలం వేసి ఆ నిధులను ప్రభుత్వానికి ఇస్తానన్నారు.