మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 19:44:09

సంక్షోభంలోనే లీడ‌ర్‌షిప్‌కు గుర్తింపు: ప‌్రియాంకాగాంధీ

సంక్షోభంలోనే లీడ‌ర్‌షిప్‌కు గుర్తింపు: ప‌్రియాంకాగాంధీ

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకగాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. దేశంలో కరోనా కార‌ణంగా నెలకొన్న పరిస్థితుల‌పై ప్రభుత్వం అలసత్వాన్ని ఆమె తప్పుపట్టారు. సంక్షోభంలోనే అసలు నాయకత్వం తెలుస్తుందని ఎద్దేవాచేశారు. అంతే కాకుండా ఆర్థిక సంక్షోభం దేశాన్ని పట్టి పీడిస్తుంటే బీజేపీ రాజస్థాన్‌లో రాజకీయాలు చేస్తోందని ఆమె విమర్శించారు.

సంక్షోభ సమయాల్లోనే అసలు నాయకత్వం బయట‌పడుతుందని, ప్రస్తుతం దేశంలో కరోనా కార‌ణంగా జాతీయ సంక్షోభం కొనసాగుతున్న‌ద‌ని, ఇలాంటి సంక్షోభాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి మంచి నాయకత్వం అవసరమ‌ని ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు. మోదీ స‌ర్కారు దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిపోయి రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వాల‌ను కూల్చాల‌ని చూస్తున్న‌ద‌ని ఆరోపించారు. మోదీ స‌ర్కారుకు ప్రజలే సమాధానం చెప్తారని ప్రియాంక అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo