ఆదివారం 01 నవంబర్ 2020
National - Sep 18, 2020 , 02:27:59

70వ పడిలోకి మోదీ

70వ పడిలోకి మోదీ

ప్రధానికి కేసీఆర్‌ శుభాకాంక్షలు 

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రధాని జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ‘లార్డ్‌ ఆఫ్‌ రికార్డ్స్‌' పేరుతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రధానిగా మోదీ చేపట్టిన 243 సాహసోపేత కార్యక్రమాలను ఇందులో వివరించారు. మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌, జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ, సీఎం కేసీఆర్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు మోదీ వన్నె తెచ్చారని రాష్ట్రపతి కోవింద్‌ కొనియాడారు.