హైదరాబాద్ : నగరానికి చెందిన ఫార్మా కంపెనీ లారస్ ల్యాబ్స్‌కు.. 2డీజీ ఉత్పత్తి కోసం డీఆర్డీవో నుంచి లైసెన్సు లభించింది. 2 డీఆక్సీ-డీ-గ్లూకోజ్(2డీజీ) ఔషధాన్ని కరోనా చికిత్స కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. పొడి రూపంలో ఉండే 2డీజీ ఔషధాన్ని నోటి ద్వారా తీసుకుంటారు. 2డీజీ ఉత్పత్తి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల డీఆర్డీవో వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని ఫార్మా కంపెనీలు ఆ ఔషధ తయారీ కోసం ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్స్.. 2డీజీ ఉత్పత్తి కోసం ఆసక్తి చూపింది. దాంతో ఆ కంపెనీకి లైసెన్సు జారీ చేశారు.