ఆదివారం 24 మే 2020
National - Mar 19, 2020 , 15:38:34

కరోనా పేషంట్ల బట్టలు ఉతకమంటున్న ధోబీలు

కరోనా పేషంట్ల బట్టలు ఉతకమంటున్న ధోబీలు

ముంబయి : దేశంలో ధోబీలకు కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్‌ సోకిన పేషంట్ల బట్టలు ఉతకటానికి భయపడుతున్నారు. తమకు కరోనా వైరస్‌ సోకుతుందేమోనని బట్టలు ఉతకడానికి ముందుకు రావడం లేదు. జనరల్‌గా ఆసుపత్రుల్లో పేషంట్ల బట్టలు బయట ధోబీలకు ఇచ్చి ఉతికిస్తుంటారు. అందువల్ల ఈ సమస్య ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉంది. కరోనా భయంతో ఆసుపత్రుల్లో ఇతర పేషంట్ల బట్టలు కూడా ఉతకట్లేదట. మహారాష్ట్రలోని యవత్మల్‌లోని ఓ ఆసుపత్రిలోని బెడ్‌షీట్లు, దిండు కవర్లు వంటి బట్టలను ఉతకమని అక్కడి ధోబీలు చెప్పారట. 

మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 169కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 


logo