శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 23, 2020 , 21:31:02

వృక్షారోపణ్ అభియాన్ ప్రారంభం

 వృక్షారోపణ్ అభియాన్ ప్రారంభం

ఢిల్లీ : కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన "వృక్షారోపణ్ అభియాన్" ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ఆరు ఎకోపార్కులు, టూరిజం సైట్లకు  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా బొగ్గు / లిగ్నైట్ కలిగిన 10 రాష్ట్రాల 38 జిల్లాల్లో 130 కి పైగా ప్రదేశాలలో చెట్ల పెంపకం ప్రచారం ప్రారంభం అయింది. "10 రాష్ట్రాల 38 జిల్లాల్లో విస్తరించి ఉన్న 130 కి పైగా ప్రదేశాలలో 6 లక్షల చెట్లను నాటినందుకు బొగ్గు మంత్రిత్వ శాఖను అభినందిస్తున్నాను." అని అమిత్ షా అన్నారు. వాతావరణ మార్పు ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని, ఈ సంక్షోభానికి పచ్చదనం మాత్రమే పరిష్కారం అని ఆయన అన్నారు. "ప్రకృతిని నాశనం చేయకూడదని, ప్రకృతి ని కాపాడాలి”అని అమిత్ షా అన్నారు.


logo