ఆదివారం 07 జూన్ 2020
National - Apr 09, 2020 , 10:49:45

మహా కరోనా కష్టాలకు కారణం?

మహా కరోనా కష్టాలకు కారణం?

హైదరాబాద్: మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం. పైగా రాజధాని ముంబైలో జనసాంద్రత ఎక్కువ. ఆ లెక్కన కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. మరణాల రేటు మాత్రం జాతీయ సగటు కన్నా రెట్టింపుగా ఉండడం కొంచెం ఆందోళన కలిగిస్తున్నది.మార్చి 9 నుంచి ఏప్రిల్ 7 లోపల కేవలం 30 రోజుల్లో కరోనా కేసులు వెయ్యి దాటాయి. మరణాల రేటు 5.98గా శాతంగా నమోదైంది. జాతీయ సగటు 2.66 శాతం మాత్రమే. కేసుల్లోనూ (696), మరణాల్లోనూ (45) ముంబైదే సింహభాగం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తక్షణం స్క్ర్రీనింగ్ జరపకపోవడం, పరీక్షలు తగినంతగా నిర్వహించకపోవడం (5400 మందికి ఒక పరీక్ష) ఈ పరిస్థితికి కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఇందులో మొదటిది కేంద్రం పరిధిలోకి వస్తుందనేది వేరే విషయం. పరీక్షించేందుకు కిట్స్ లేకపోతే కనీసం వచ్చినవారిని క్వారంటైన్ చేసినా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ విమానాలను మార్చి మొదటివారంలోనే నిలిపివేసినా బాగుండేదని మరో ఆలోచన. ఇది కూడా కేంద్రం పరిధిలోని అంశమే. ప్రస్తుతం పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.


logo