ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 16:47:18

భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర!

భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర!

న్యూఢిల్లీ : భారత్‌లో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్‌పై దేశమంతా పోరాడుతున్న విషయం విదితమే. ఈ సమయంలోనే జమ్మూకశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేయాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీంతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేతులు కలిపినట్లు సమాచారం. ఆదివారం రోజు ఇస్లామాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో దావూద్‌ ఇబ్రహీంతో.. పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో.. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్లు తెలిసింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్‌ను తుదముట్టించే పనిలో అందరూ నిమగ్నమయ్యారు.. ఇప్పుడే దాడులు చేసేందుకు సరైన సమయని ఐఎస్‌ఐ భావించినట్లు సమాచారం. 

కశ్మీర్‌ వ్యాలీలో ఉగ్రవాద దాడులు చోటు చేసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమవారం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హంద్వారాలో ముగ్గురు జవాన్ల మృతికి తామే బాధ్యులమని టీఆర్‌ఎఫ్‌(ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌) ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం విదితమే. 


logo