ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 09:51:49

క‌శ్మీర్‌లో ల‌ష్క‌రే ఉగ్ర‌వాది అరెస్టు

క‌శ్మీర్‌లో ల‌ష్క‌రే ఉగ్ర‌వాది అరెస్టు

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని బుద్గామ్‌లో ఉగ్ర‌వాదుల స్థావ‌రాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఉగ్ర‌వాది జాహుర్ వానిని అరెస్టు చేశారు.  ల‌ష్క‌రే తోయిబాకు జాహుర్‌.. టాప్ వ‌ర్క‌ర్‌గా ప‌నిచేశాడు. అత‌ని వ‌ద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఘ‌ట‌న‌లో మ‌రో న‌లుగుర్ని కూడా అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. జాహుర్ వాణి.. బుద్గామ్‌తో పాటు బారాముల్లా ప్రాంతాల్లో ఉగ్ర కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాడు. ల‌ష్క‌రే తోయిబాకు చెందిన యూసుఫ్ ఖంత్రూతో జాహుర్‌ అత్యంత స‌న్నిహితంగా మెలిగాడు. అత‌నికి ఇంటికి కేవ‌లం 300 మీట‌ర్ల దూరంలో ఆయుధ స్థావ‌రం ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.  ఖంత్రూకు చెందిన ల‌ష్క‌రే బృందానికి.. జాహుర్ వాని అన్ని త‌ర‌హాల ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసేవాడ‌ని పోలీసులు తెలిపారు.  logo