మంగళవారం 02 జూన్ 2020
National - Apr 03, 2020 , 15:13:05

కశ్మీర్‌లో లష్కరే తోయిబా ముఠా అరెస్ట్‌

కశ్మీర్‌లో లష్కరే తోయిబా ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో లష్కరే తోయిబా ముఠాను పోలీసులు ఛేదించారు. కుప్వారా జిల్లాలోని హండ్వారా పోలీసులు నాలుగురు తీవ్రవాదులు, వారితో సంబంధమున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారివద్ద మూడు ఏకే-47 రైఫిళ్లు, 12 హాండ్‌ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎస్‌వోజీ), 22 రాష్ట్రీయ రైఫిల్స్‌ బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఉగ్రవాదులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సోపోర్‌ ఎస్పీ తెలిపారు. 


logo