సోమవారం 13 జూలై 2020
National - Jan 22, 2020 , 17:55:52

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

తమిళనాడు: చెన్నై ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణీకుడిని నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడు: చెన్నై ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణీకుడిని నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. జనవరి 20న GF068 నెంబర్‌ గల ఫ్లైట్‌లో అబుదాబి నుంచి చెన్నైకి చేరుకున్న ఓ ప్రయాణీకుడి అనుమానాస్పద కదలికలు గమనించిన కస్టమ్స్‌ అధికారులు అతడిని, అతని లగేజీని తనిఖీ చేశారు. తీరా చూస్తే అతడి వద్ద ఉన్నటువంటి.. ఎమెర్జెన్సీ లైట్‌ కోసం ఉపయోగించే బ్యాటరీలో 2.1 కేజీల బంగారం లభించింది. బంగారాన్ని సీజ్‌ చేసిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. బంగారం విలువ దాదాపు 1.1 కోట్ల విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. 


logo