శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 14, 2020 , 19:17:40

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

తమిళనాడు: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ కస్టమ్స్‌ అధికారులకు ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం పట్టుబడింది. ఫారిన్‌ నుంచి చెన్నైకి వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా.. అతని లగేజీలో 2 కేజీల బంగారం లభించింది. ఈ బంగారానికి సంబంధించి.. ప్రయాణికుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయే సరికి సదరు ప్రయాణికుడు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. బంగారాన్ని సీజ్‌ చేసి, అతడిని అరెస్ట్‌ చేశారు. కస్టమ్స్‌ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 86 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అధికారులు  విచారిస్తున్నారు.


logo