శనివారం 23 జనవరి 2021
National - Nov 24, 2020 , 10:44:40

ల్యాండ్ అటాక్ వ‌ర్ష‌న్‌.. అండ‌మాన్ దీవుల్లో బ్ర‌హ్మోస్ మిస్సైల్ ప‌రీక్ష‌

ల్యాండ్ అటాక్ వ‌ర్ష‌న్‌.. అండ‌మాన్ దీవుల్లో బ్ర‌హ్మోస్ మిస్సైల్ ప‌రీక్ష‌

హైద‌రాబాద్‌: బ్ర‌హ్మోస్ సూప‌ర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను ఇవాళ భార‌త్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.  అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఈ  ప‌రీక్ష జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  మ‌రో దీవిలో ఉన్న టార్గెట్‌ను ఆ మిస్సైల్ ధ్వంసం చేసింది.  ల్యాండ్ అటాక్ వ‌ర్ష‌న్‌కు చెందిన బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని ప‌రీక్షించిన‌ట్లు తాజాగా వెల్ల‌డైంది. అయితే ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు ఇంకా అందాల్సి ఉన్న‌ది. సూప‌ర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు ప‌రీక్షించారు.  అత్యంత విజ‌య‌వంతంగా టార్గెట్‌ను ఆ క్షిప‌ణి ధ్వంసం చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.  భార‌తీయ ఆర్మీ నేతృత్వంలో ఆ ప‌రీక్ష జ‌రిగింది.  డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను ఆర్మీ వినియోగిస్తోంది. బ్ర‌హ్మోస్ క్షిప‌ణి స్ట్ర‌యిక్ రేంజ్‌ను 400 కిలోమీట‌ర్లకు పెంచిన‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 
logo