శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 09:27:50

మాజీ సీఎంకు కరోనా పరీక్షలు..

మాజీ సీఎంకు కరోనా పరీక్షలు..

రాంచీ : పశువుల దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే లాలూకు కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జార్ఖండ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన గత కొద్ది రోజుల నుంచి రాజేంద్ర ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన నుంచి నమూనాలను సేకరించినట్లు డాక్టర్‌ ఉమేష్‌ ప్రసాద్‌ తెలిపారు. కరోనా ఫలితం ఆదివారం మధ్యాహ్నం సమయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. 

కరోనా విజృంభణ నేపథ్యంలో జైలు నుంచి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను విడుదల చేయాలని రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) ఏప్రిల్‌ నెలలో డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. 


logo