సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 17:10:49

వాళ్లు ఈ ప్రాజెక్టును ప‌ట్టించుకోలేదు: ప‌్ర‌ధాని మోదీ

వాళ్లు ఈ ప్రాజెక్టును ప‌ట్టించుకోలేదు: ప‌్ర‌ధాని మోదీ

ప‌ట్నా: ‌బీహార్‌లోని కోసీ రైల్ బ్రిడ్జిని ప్రారంభించిన సంద‌ర్భంగా ప్రధాని న‌రేంద్ర‌ మోదీ ఆర్జేడీ అధినేత, రైల్వేశాఖ‌ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్‌పై విమర్శలు చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హ‌యాంలో కోసీ ప్రాజెక్టు ప‌నులు వేగంగా జ‌రిగాయ‌ని, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగాయని ప్ర‌ధాని ఎద్దేవాచేశారు. అప్పటి రైల్వే మంత్రులు ఈ ప్రాజెక్టు గురించి కనీస ఆందోళన కూడా చెందలేదని పరోక్షంగా లాలూపై మండిపడ్డారు. 

లాలూప్ర‌సాద్ యాద‌వ్‌ గనుక అనుకుని ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్త‌య్యేద‌ని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి లాలూ ప్ర‌సాద్‌ ఇష్టపడలేదని ప్ర‌ధాని మోదీ ఆరోపించారు. సరైన భాగస్వామ్య పక్షాలుంటే ప్రతిదీ సాధ్యమేనని ప‌రోక్షంగా నితీశ్‌ను కొనియాడారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo