సోమవారం 13 జూలై 2020
National - Jul 01, 2020 , 17:31:23

ఈసారి ముంబై లాల్‌బగ్చా గణేశ్‌ ఉత్సవాలు రద్దు..

ఈసారి ముంబై లాల్‌బగ్చా గణేశ్‌ ఉత్సవాలు రద్దు..

ముంబై: మనకు వినాయక చవితి అతిపెద్ద పండుగ. వాడవాడలా గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్టించి, ఘనంగా నవరాత్రోత్సవాలు నిర్వహిస్తుంటాం. అయితే, ఈ సారి కొవిడ్‌ నేపథ్యంలో లంభోదరుడి ప్రతిష్టాపన లేనట్లే కనిపిస్తున్నది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే ప్రతిఏటా ఉత్సవాలను అతి భారీగా నిర్వహించే లాల్‌బగ్చా ఉత్సవ కమిటీ ఈసారి ప్రతిష్టాపనను రద్దు చేసింది. దానికి బదులుగా పదకొండు రోజులుపాటు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంతోపాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ కమిటీ నిర్ణయించింది. 

‘ప్రతి ఏటా వినాయకుడిని ప్రతిష్టించే చోట ఈసారి రక్త, ప్లాస్మాదాన శిబిరాలను నిర్వహిస్తాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు, పోలీసుల కుటుంబాలను సత్కరిస్తాం. అలాగే, కరోనాపై పోరాటం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25లక్షలు డొనేట్‌ చేస్తాం.’ అని  ఉత్సవ కమిటీ సెక్రెటరీ సుధీర్ సాల్వీ తెలిపారు. కాగా, 87 ఏళ్ల లాల్‌బాగ్చా హిస్టరీలో ఉత్సవాలను రద్దు చేయడం ఇదే మొదటిసారి కానుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo